PAVITROTSAVAM BEGINS IN SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు  ప్రారంభం‌

Tirupati,30 June 2023: The annual Pavitrotsavams commenced at the Sri Kapileswara Swamy temple on Friday with the imposing Snapana Tirumanjanam offering to the Pancha murtis of the temple.

 

All the five utsava idols of Sri Kapileswawara, Sri Kamakshi, Sri Vigneswara, Sri Subramanya and Sri Chandikeswara were offered Snapanam and the rituals of Kalasa Puja, Homa, and Pavitra Pratista were performed in the evening.

 

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju, Kankana bhattar Sri Uday Kumar Gurukul, superintendent Sri Bhupathi, temple inspectors Sri Ravi Kumar, Sri Balakrishna were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు  ప్రారంభం‌

తిరుపతి, 2023 జూన్‌ 30: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలు శుక్రవారం ప్రారంభ‌మ‌య్యాయి. 

ఇందులో భాగంగా ఉద‌యం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, గంధం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం చేప‌ట్టారు. ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ కె.సుబ్బరాజు, కంకణభట్టార్ శ్రీ ఉదయకుమార్ గురుకుల్, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.        

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.