PAVITOTSAVAMS CONCLUDES_ శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirupati, 15 Jul. 19: The annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati concluded on a grand note on Monday.

On the final day Maha Purnahuti was observed by the temple priests.

Temple DyEO Sri Subramanyam and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2019 జూలై 15: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు.

సాయంత్రం 6.30 గంటల నుండి 9 గంటల వరకు పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వ‌హించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, అర్చ‌కులు శ్రీ ఉద‌య‌శంక‌ర్ గురుకుల్‌, శ్రీ స్వామినాథ గురుకుల్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.