RUDRA HOMA BEGINS AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌హోమం ప్రారంభం

Tirupati,01 December 2023:  As part of the month-long Homa Mahotsavam being organised by TTD in Sri Kapileswara Swamy Temple in Tirupati, Sri Rudra Yagam on Friday.

 

The ten-day-long Rudra Yagam began with Vedic rituals at temple Yagashala in the morning and concluded in the evening with Rudratrtshati, Bilvarchana, Nivedana Visesha Deeparadhana and Harati.

 

The auspicious Homa will be held till December 11 for the well-being of humanity.

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju, Superintendent Sri Bhupati and others were present. 

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌హోమం ప్రారంభం

తిరుపతి, 2023 డిసెంబరు 01: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌హోమం) శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుండి 11వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ర‌వికుమార్‌, శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.