LAKSHA KUMKUMARCHANA PERFORMED AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన
Tirupati, August 22, 2025: Laksha Kumkumarchana was performed with religious fervour to Goddess Kamakshi at the sacred Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.
As part of the rituals, deities Sri Mahalakshmi, Sri Saraswati, and Sri Kamakshi were ceremoniously seated in the temple mandapam, and the special Kumkumarchana was conducted. The program began with Kalasha Sthapana, Ganapati Puja, Punyahavachanam, and Kalasharadhana, followed by Kumkum Archana to the Goddess.
TTD Deputy EO Smt. Nagaratna, AEO Sri Subba Raju, Superintendent Sri Chandrasekhar, temple priests, officials, and a large number of devotees participated in the auspicious event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన
తిరుపతి, 2025 ఆగస్టు 22: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ సుబ్బా రాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఆర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల




