TRISHULA SNANAM HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం
Tirupati, 17 February 2026: The sacred Trishula Snanam was observed with utmost religious fervour on Tuesday, on the final day of the annual Brahmotsavams at Sri Kapileswara Swamy Temple in Tirupati.
From 6:30 AM to 9 AM, Sri Nataraja was taken in a grand procession on the Surya Prabha Vahanam up to Anna Rao Circle and returned to the temple.
At 9AM, the temple priests performed the Trishula Snanam in accordance with Saiva Agama traditions.
The ceremonial Snapana Tirumanjanam was performed to the Trishula, the divine weapon of Sri Kapileswara Swamy, invoking peace and prosperity.
The rituals included Purnahuti, Kalasodwasam, and Kalasabhishekam to the Moolavarlu.
The Brahmotsavams will formally conclude in the evening with Dwajavarohanam from 6 PM to 7:30 PM. Later, the Ravanasura Vahana Seva will be held from 8PM to 10PM.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం
తిరుపతి, 2026 ఫిబ్రవరి 17: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.
ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.
హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరస్త్రీని చెరబట్టడమనే దుర్మార్గానికి పాల్పడటం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర శేఖర్, ఆలయ అర్చకులు విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.













