CHANDI HOMAM COMMENCES _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా చండీ హోమం
Tirupati, 22 November 2023: The nine-day-long Chandi Homam commenced at Sri Kapileswara Swamy temple on Wednesday.
As a part of the ongoing month-long Homa Mahnotsavams in Sri Kapileswara Swamy temple, Sri Kamakshi Yagam also known as Chandi Homam will be observed till November 30.
DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupati, temple inspector Sri Balakrishna and temple Archakas were also present.
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
తిరుపతి, 2023 నవంబరు 22: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు చండీయాగం వైభవంగా జరుగనుంది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహిస్తారు.
కాగా, గృహస్తులు రూ.500/- టికెట్‌తో ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.