LAKSHABILVARCHANA HELD IN SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన

Tirupati, 30 November 2023: Laksha Bilvarchana Seva was performed in a religious manner at Sri Kapileswara Swamy temple in Tirupati on Thursday. 

Special programs were organized in the temple on this occasion.

As part of this, Abhishekam, Alankaram and Archana were performed by waking up the Lord at 3 am with Suprabhatam.  Laksha Bilvarchana Seva was held from 6 am to 12 am.  In this, the deity was worshipped with one lakh bilva leaves.

In the evening, the idol of Sri Chandrasekhara Swami will be paraded through the streets.

Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar, Sri Balakrishna, temple priests and officials participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన

తిరుప‌తి, 2023 నవంబరు 30: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.

సాయంత్రం శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ర‌వికుమార్‌, శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.