CHANDI YAGAM COMMENCES IN KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
TIRUPATI, 10 NOVEMBER 2024: As a part of the Homa Mahotsavams, Chandi Yagam commenced in Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday.
This Homam will last for nine days.
In the morning Nitya Homam, Chandi Homam, Laghu Purnahuti were performed while in the evening Chandi Parayanam, Sahasra Namarchana and Visesha Homam were performed.
DyEO Sri Devendra Babu, Grihasta devotees and other staff were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
తిరుపతి, 2024 నవంబరు 10: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు చండీయాగం వైభవంగా జరుగనుంది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహిస్తారు.
కాగా, గృహస్తులు రూ.500/- టికెట్‌తో ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు, పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.