KALABHAIRAVA HOMAM HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాల‌భైర‌వ హోమం

TIRUPATI, 20 NOVEMBER 2023: As a part of ongoing Karthika masa Homa Mahnotsavams in Sri Kapileswara Swamy temple, Sri Kalabhairava Homam was observed on Monday.

On November 21 Navagraha Homam will be observed.

Temple DyEO Sri Devendra Babu and other staffs, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాల‌భైర‌వ హోమం

తిరుపతి, 2023 నవంబరు 20: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ కాల‌భైర‌వ‌ హోమం ఘ‌నంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో న‌వంబ‌రు 14 నుండి డిసెంబ‌రు 12వ తేదీ వ‌ర‌కు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్ట‌భైర‌వ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, శ్రీ కాల‌భైర‌వ మూల‌వ‌ర్ల‌కు క‌ల‌శాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, పూజ‌, జ‌పం, హోమం, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

నవంబరు 21న నవగ్రహ హోమం :

హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 21వ తేదీ మంగ‌ళ‌వారం నవగ్రహ హోమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ర‌వికుమార్, శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.