LAKSHKUMKUMA ARCHANA SEVA OBSERVED IN SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుకగా లక్షకుంకుమార్చన సేవ
Tirupati, 15 September 2023: Laksha Kumkumarchana seva was held for Goddess Sri Kamakshi on the last Friday of Sravan month at Sri Kapileswara Swamy temple in Tirupati.
As part of this, starting with Ganapati Puja and Punyahavachanam, Lakshkumkumarchana was performed to Goddess Sri Kamakshi till 12 noon. From 6 pm to 8 pm Sri Chandrasekhara Swamy and Sri Manonmani Amma gave darshan to the devotees on Tiruchi.
Temple Deputy EO Sri. Devendra Babu, AEO Sri. Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar, Sri. Balakrishna participated in this religious program.
శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుకగా లక్షకుంకుమార్చన సేవ
తిరుపతి, 15 సెప్టెంబరు 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజున శ్రీ కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ వేడుకగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనంతో ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ కామాక్షి అమ్మవారికి లక్షకుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామి, శ్రీ మనోన్మణి అమ్మవారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.