KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

TIRUPATI, 30 JUNE 2022The traditional Temple cleaning festival Koil Alwar Tirumanjanam was held with religious fervour in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Thursday.

 

This event was held in collection with the annual Sakshatkara Vaibhavm which will commence on July 3 and concludes on July 5.

 

The entire Temple premises were cleaned with Parimalam-an aromatic mixture.

 

Special Grade Deputy EO Smt Varalakshmi, Superintendent Sri Chengalrayalu, Archakas and others participated in this unique cleansing fete.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి, 2022 జున్ 30: శ్రీనివాసమంగాపురం లోనిశ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు జులై 3 నుండి 5వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ ఉత్స‌వానికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7.30 నుండి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిపారు.ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూపరిండెంట్ శ్రీ చంగలరాయులు, అర్చకులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.