SALAKATLA VAIBHAVOTSAVAMS _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం
TIRUPATI, 17 JUNE 2023: The booklets related to the annual Salakatla Vaibhavotsavams in Srinivasa Mangapuram was released by TTD JEO Sri Veerabrahmam on Saturday evening.
The annual event will be observed in Sri Kalyana Venkateswara Swamy temple between June 24 and 26 and Paruveta Utsavam on June 27.
In the event that took place in JEO’s chamber in TTD Administrative Building, Special GrDyEO Smt Varalakshmi, PRO Dr T Ravi, Archaka Sri Narayana Deekshitulu were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 17జూన్ 2023: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న సాక్షాత్కార వైభవోత్సవాల బుక్ లెట్ ను జేఈవో శ్రీ వీర బ్రహ్మం శనివారం రాత్రి పరిపాలన భవనం లోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జూన్ 22వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
జూన్ 24న పెద్ద శేష వాహనం, జూన్ 25న హనుమంత వాహనం, జూన్ 26న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
జూన్ 27న పార్వేట ఉత్సవం :
సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూన్ 27వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుండి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, పిఆర్వో డాక్టర్ రవి , అర్చకులు శ్రీ నారాయణ దీక్షితులు తదితరులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.