KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 22 JUNE 2023: The cleaning fete Koil Alwar Tirumanjanam was observed in Srinivasa Mangapuram between 6am and 11:30am on Thursday in connection with Sakshatkara Vaibhavotsavams from June 24-26.
The entire temple premises including the sanctum sanctorum was cleansed with aromatic Parimalam.
Later the devotees are allowed for darshan.
Spl. Gr. DyEO Smt Varalakshmi and other office staff were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 22 జూన్ 2023: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 24న పెద్దశేష వాహనం, జూన్ 25న హనుమంత వాహనం, జూన్ 26న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ నరసింహులు స్వామివారికి రూ.18 వేలు విలువగల కురాళాలు, పరదాలు విరాళంగా అందించారు.
ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ టి.వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, అర్చకులు శ్రీ నారాయణ దీక్షితులు తదితరులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.