శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
తిరుపతి, మే 23, 2013: మే 28 నుండి 30వ తేదీ వరకు జరుగనున్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాల పోస్టర్లను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో తితిదే ఈవో ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. వీటితోపాటు ‘తిరుపతి పరిసర క్షేత్రాలు’, ‘శ్రీ శఠగోప వాక్‌సుధ’, ‘శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు’ అనే మూడు పుస్తకాలను ఈవో ఆవిష్కరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.