PAVITROTSVAMS COMMENCES _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 09 NOVEMBER 2023: The annual Pavitrotsvams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram commenced on a grand religious note on Thursday.
As a part of it Pavitra Pratista was observed by Acharyas amidst the chanting of Vedic hymns in the Yaga Shala.
Earlier in the morning Snapana Tirumanjanam was performed to the Utsava deities.
Special Gr DyEO Smt Varalakshmi and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2023 నవంబరు 09: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అంతకుముందు వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, అర్చకులు శ్రీ నారాయణాచార్యుల చేతులమీదుగా ఆచార్య రుత్విక్‌వరణం కార్యక్రమం జరిగింది.
అనంతరం సాయంత్రం స్వామి, అమ్మవార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించనున్నారు.
పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 9 నుంచి 11వ తేదీ వరకు కల్యాణోత్సవం, నవంబరు 9న తిరుప్పావడ సేవ రద్దయ్యాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ అనంబట్టు ధనశేఖర్, అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.