EO RELEASES BOOKLET OF SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE BRAHMOTSAVAM BOOKLET _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఈవో

Tirupati, February 07, 2025:  TTD EO Sri J. Shyamala Rao unveiled the booklet for the annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram on Friday evening. 

Speaking after the program held at the camp office in Tirumala the EO said that the Koil Alwar Thirumanjanam fete on February 13 and the  Ankurarpana utsav will be held on February 17and the Dhwajarohanam on February 18.

Main vahana  Sevas will be Garuda Vahana on February 22, Swarna Ratha, on   23, Rathotsavam on February 25, and Chakrasnanam on February 26. 

He said that all Vahana Sevas will be held from 8 to 9 am in the morning and from 7 to 8 pm in the evening. He appealed to devotees to participate in the Vahana Sevas in large numbers and seek the blessings of the Lord.

The temple’s Special Class Deputy EO, Smt Varalakshmi, temple priests and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్ లెట్ ను ఆవిష్కరించిన టీటీడీ ఈవో

తిరుపతి, 2025 ఫిబ్రవరి 07: శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్ లెట్ ను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 13వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందన్నారు. ఫిబ్రవరి 17న అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఫిబ్రవరి 18న ధ్వజారోహణం, 22న గరుడ వాహనం, 23న సాయంత్రం స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు. వాహన సేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.