THREE-DAY SAKSHATKARA VAIBHAVOTSAVAMS IN SKVST _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
Tirupati, 28 June 2025: The Sakshatkara Vaibhavotsavams of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram will be held from June 30 to July 2.
On July 3, Parvetotsavam will be conducted from 7 AM to 2 PM.
Due to these festivities, certain daily sevas stands cancelled.
From June 30 to July 3, Nitya Kalyanotsavam and Tiruppavada Seva are cancelled. On July 1, Swarnapushparchana will not be performed, and on July 2, Ashtottara Shata Kalasha Abhishekam stands cancelled.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2025, జూన్ 28: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02 తేదీ వరకు మూడు రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆలయంలో ప్రత్యేకంగా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టారు. వాహనసేవల కోసం పెద్దశేష, హనుమంత, గరుడ వాహనాలను సిద్ధం చేశారు.
మొదటి రోజు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండో రోజు జూలై 01వ తేదీ హనుమంత వాహనంపై, మూడో రోజు జూలై 02వ తేదీ గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూలై 03న పార్వేట ఉత్సవం
జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా జూన్ 30వ తేదీ నుండి జూలై 03వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, తిరుప్పావడ సేవ, జూలై 01వ తేదీ స్వర్ణపుష్పార్చన, జూలై 02వ తేదీ అష్టోత్తర శతకలశాభిషేకం సేవలను రద్దు చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.