KOIL ALWAR TIRUMANJANAM HELD IN SRINIVASA MANGAPURAM TEMPLE _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, February 05, 2026: In view of the annual Brahmotsavams scheduled to be held from February 8 to 16, the Koil Alwar Thirumanjanam was performed with grandeur on Thursday at the Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasamangapuram. It is a customary ritual to conduct Koil Alwar Thirumanjanam prior to the commencement of the Brahmotsavams.

On this occasion, the Lord was awakened in the early hours with Suprabhatam, followed by Tomala Seva, Koluvu, and Panchanga Sravanam. The Koil Alwar Thirumanjanam was conducted from 6.30 am to 11.00 am. As part of the ritual, the temple premises, walls, ceilings, puja articles, and all other items were first cleansed with water. Thereafter, a sacred mixture prepared with fragrant substances such as Namam powder, Srichurnam, kasturi turmeric, pachaku, edible camphor, sandalwood powder, kumkum, kicherigadda, and other aromatic ingredients was sprinkled throughout the temple. Devotees were allowed for darshan from 11.00 am onwards.

Donation of Curtains:

Sri Mani of Tirupati donated two curtains and two kuralas to the temple. These will be utilized during the forthcoming Brahmotsavams.

The programme was attended by Special Grade Deputy EO Smt. Varalakshmi, Vigilance Officer Sri Giridhar, AE0 Sri Gopinath, Superintendent Sri Ramesh Babu, Temple Inspectors Sri Dhanasekhar and Sri Munikumar, Temple Archaka Sri Balaji Rangacharyulu, and other officials.

Details of Vahana Sevas during Brahmotsavams:

February 08, 2026

Morning – Dhwajarohanam (Kumbha Lagna: 8.15 am to 8.35 am)

Night – Pedda Sesha Vahanam

February 09, 2026

Morning – Chinna Sesha Vahanam

Night – Hamsa Vahanam

February 10, 2026

Morning – Simha Vahanam

Night – Mutyapu Pandiri Vahanam

February 11, 2026

Morning – Kalpavruksha Vahanam

Night – Sarvabhoopala Vahanam

February 12, 2026

Morning – Pallaki Utsavam (Mohini Avataram)

Night – Garuda Vahanam

February 13, 2026

Morning – Hanumantha Vahanam

Afternoon – Vasantotsavam (2.00 pm to 3.00 pm)

Evening – Swarna Ratham (4.00 pm to 5.00 pm)

Night – Gaja Vahanam

February 14, 2026

Morning – Suryaprabha Vahanam

Night – Chandraprabha Vahanam

February 15, 2026

Morning – Rathotsavam

Night – Ashwa Vahanam

February 16, 2026

Morning – Chakrasnanam (9.55 am to 10.15 am)

Night – Dhwajavarohanam (6.00 pm to 7.00 pm)

Vahana Sevas will be held daily from 8.00 am to 9.00 am and 7.00 pm to 8.00 pm.

On the occasion of the Brahmotsavams, under the auspices of the TTD Hindu Dharma Prachara Parishad, Kolata dances and Bhajan programmes will be conducted every day prior to the Vahana Sevas. Artists of the Annamacharya Project will render Annamacharya Sankeertanas.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2026 ఫిబ్రవరి 05: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘ‌నంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

పరదాలు విరాళం :

తిరుపతికి చెందిన శ్రీ మ‌ణి రెండు పరదాలు, రెండు‌ కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, విజివో శ్రీ గిరిధ‌ర్, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ధ‌నశేఖ‌ర్‌, శ్రీ మునికుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

08-02-2026

ఉదయంధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం. 8.15 నుండి 8.35 గంటల వరకు)

రాత్రిపెద్దశేష వాహనం

09-02-2026

ఉదయంచిన్నశేష వాహనం

రాత్రిహంస వాహనం

10-02-2026

ఉదయంసింహ వాహనం

రాత్రిముత్యపుపందిరి వాహనం

11-02-2026

ఉదయంకల్పవృక్ష వాహనం

రాత్రిసర్వభూపాల వాహనం

12-02-2026

ఉదయంపల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రిగరుడ వాహనం

13-02-2026

ఉదయంహనుమంత వాహనం

మధ్యాహ్నంవసంతోత్సవం (. 2 నుండి 3 గంటల వరకు)

సాయంత్రంస్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)

రాత్రిగజ వాహనం

14-02-2026

ఉదయంసూర్యప్రభ వాహనం

రాత్రిచంద్రప్రభ వాహనం

15-02-2026

ఉదయంరథోత్సవం

రాత్రిఅశ్వవాహనం

16-02-2026

ఉదయంచక్రస్నానం(. 9.55 నుండి 10.15 గంటల వరకు)

రాత్రిధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)

ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టిటిడి ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.