ANKURARPANAM PERFORMED _ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
TIRUPATI, 27 OCTOBER 2024: The Ankurarpanam for the annual Pavitrotsavams was held at Srinivasa Mangapuram on Sunday evening.
This annual festival is usually performed as a sin-free event to omissions and commissions performed either knowingly or unknowingly by temple staff, religious staff and devotees.
On the first day on October 28 Pavitra Pratista, the second-day Pavitra Samarpana and on the last day Pavitra Purnahuti will be observed.
Spl. Gr.DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2024 అక్టోబరు 27: శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు .
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి .
ఇందులో భాగంగా 28న పవిత్రప్రతిష్ఠ, అక్టోబరు 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ నిర్వహిస్తారు. అక్టోబరు 30న రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి .
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి . వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి , ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ , ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.