శ్రీ కె.వి. రమణాచారికి ఉస్మానియా యూనివర్శిటి డాక్టరేట్
శ్రీ కె.వి. రమణాచారికి ఉస్మానియా యూనివర్శిటి డాక్టరేట్
తిరుపతి ఫిబ్రవరి-21,2009: తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి. రమణాచారికి హైదరాబాద్ నందుగల ఉస్మానియా యూనివర్శిటివారు డాక్టరేట్ ప్రధానం చేశారు.
1991-2000 మద్యకాలంలో ‘పద్య కవిత్వం – వస్తువైవిద్యం’ అను అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఆచార్య యల్లూరి శివారెడ్డి పర్యవేక్షణలో ఆయన తమ పరిశోధన పత్రాన్ని సమర్పించారు. 2005 సం.లో పార్ట్-టైం పరిశోధకుడుగా తన పేరును నమోదు చేసుకున్న ఆయనకు నేడు ఉస్మానియా యూనివర్శిటీ డాక్టరేట్ ఇచ్చినది.
శ్రీ కె.వి. రమణాచారి గారు 1972లో ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ) ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తూ పరిశోధన చేస్తూవుండేవారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కాబడినందున అప్పటికే కొనసాగుతున్న పరిశోధన కొనసాగించలేకపోయారు. పిమ్మట 25 ఏళ్ళ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో దూరవిద్యావిభాగం ద్వారా 2005 నుండి తెలుగు విభాగంలో ‘పద్యకవిత్వం – వస్తువైవిద్యం’ అను అంశంపై పరిశోధన గావించారు.
డాక్టరేట్ పొందిన శ్రీకె.వి.రమణాచారికి సహజంగా తెలుగుభాష, సంస్కృతి,వికాసం, ధర్మం, ఆధ్యాత్మికత విషయాలపై మక్కువ ఎక్కువ. ఈ సందర్భంగా ఇ.ఓ మాట్లాడుతూ స్వామివారి సేవకుడుగా పనిచేస్తున్నప్పుడు పి.హెచ్.డి.రావడం స్వామి కృపాకటాక్షం, పెద్దల ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.