PROCESSION HELD _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామకోటి విజయోత్సవం

TIRUPATI, 23 OCTOBER 2023:The divine procession of Sri Ramakoti Vijayotsavam was held with religious fervor in Tirupati on Monday.

Every year on the auspicious day of Vijaya Dasami, the books where devotees penned Rama Koti are collected and deposited in Rama Sthupam at Sri Ramachandra Pushkarini.

Superintendent Sri Suresh and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామకోటి విజయోత్సవం

తిరుపతి, 2023, అక్టోబ‌రు 23: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీరామకోటి విజయోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం విజయదశమినాడు ఈ కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయం.

ఈ సందర్భంగా భ‌క్తులు సంవత్సర కాలంలో రాసిన శ్రీరామకోటి పుస్తకాలను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. అక్కడున్న‌ శ్రీ రామకోటి స్థూపంలో ఈ పుస్తకాలను నిక్షిప్తం చేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ సురేష్, టెంపుల్ ఇన్స్సెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.