KOIL ALWAR TIRUMANJANAM IN SRI KODANDARAMA SWAMY TEMPLE _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 25 March 2025: Koil Alwar Tirumanjanam was held in Tirupati Sri Kodandarama Swamy Temple on Tuesday.
It is known that the annual Brahmotsavam will be held in the temple from 27th March to 4th April. It is customary to perform Koil Alwar Tirumanjanam before Brahmotsavam.
Donation of curtains to the temple:
A devotee named Smt. Prasanna Reddy from Hyderabad donated temple door curtains (Paradalu)on Tuesday.
Temple Deputy EO Smt Nagaratna, AEO Sri Ravi, Superintendent Sri. Muni Sankaran, Chief Priest Sri Anandkumar Dixitulu, Temple Inspector Sri Suresh and other officials participated in this program.
Ankurarpanam on March 26:
Ankurarpanam will be held on 26th March from 7pm to 8.30 pm.
On this occasion, Senadhipati Utsavam, Medini Puja, Mritsangrahanam and other programs are organized.
Details of Vahana Sevas during Brahmotsavams:
27-03-2025
Morning – Dhwajarohanam (9.15 am to 9.30 am)
Night – Peddsesha
28-03-2025
Chinna sesha
Night – Hamsa
29-03-2025
Morning – Simha
Night – Mutyapu Pandiri
30-03-2025
Morning – Kalpavriksha
Night – Sarvabhoopala
31-03-2025
Morning – Pallaki Vahanam
Night – Garuda
01-04-2025
Morning – Hanuman
Night – Gaja
02-04-2025
Morning – Suryaprabha
Night – Chandra Prabha
03-04-2025
Morning – Rathotsavam
Night – Aswa
04-04-2025
Morning – Chakra Snanam
Night – Dhwajavarohanam
The Vahana Sevas are operated daily from 8 am to 9.30 am and from 7 pm to 8.30 pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
• మార్చి 26న అంకురార్పణ
తిరుపతి, 2025 మార్చి 25: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
ఆలయానికి పరదాలు విరాళం :
శ్రీ కోదండరామాలయానికి మంగళవారం హైదరాబాదుకు చెందిన శ్రీమతి ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు మూడు పరదాలు, నాలుగు కురాళాలు విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకరన్, ప్రధాన అర్చకులు శ్రీ ఎపి.ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్చి 26న అంకురార్పణ :
శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి 26వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
27-03-2025
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.15 నుండి 9.30 గంటల వరకు)
రాత్రి – పెద్దశేష వాహనం
28-03-2025
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
29-03-2025
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
30-03-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
31-03-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం
01-04-2025
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
02-04-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
03-04-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
04-04-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.