MAHA SAMPROKSHANA PROGRAMS AT VONTIMITTA TEMPLE _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాలు
Vontimitta, 07 March 2025: Maha Samprokshan programs in Sri Kodandarama Swamy temple at Vontimitta commenced in a grand religious manner on Friday.
Sahasra Kalasavahana, Rama Taraka Homam, Sri Madramayana Homam, Pavamana Panchasukta Homam, Vimana Gopuram Chaya Snapanam, Parivara Homam and Poornahuti were conducted under the guidance of TTD Agama Advisor and Kankanabattar Sri Rajesh Swamy.
Mass recitation of Vishnu Sahasranama, Chatusthanarchana and Murthy Homam took place at 5.30 pm.
Deputy EOs Sri. Natesh Babu, Smt. Prashanthi, Superintendent Sri. Hanumanthaiah, Temple Inspector Sri. Naveen, other officials and temple priests participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాలు
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 మార్చి 0: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
టీటీడీ ఆగమ సలహాదారులు మరియు ప్రధాన కంకణబట్టర్ శ్రీ రాజేష్ స్వామి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు సహస్ర కలశావాహన, రామ తారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమములు, విమాన గోపురం ఛాయా స్నపనము, పరివార హోమములు, పూర్ణాహుతి నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనము, మూర్తి హోమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.