శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

తిరుపతి, 2020 ఆగస్టు 14: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్ర‌వారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు, శ్రీకృష్ణ‌స్వామివారిని ముఖ మండ‌పంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఉభ‌య‌దారులు ఉభ‌యాలు స‌మ‌ర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ర‌మేష్ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.