SATAKALASABHISHEKAM HELD _ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
TIRUPATI, 17 OCTOBER 2024: Astottara Sata Kalasabhishekam was observed in Sri Kodandarama Swamy temple in Tirupati on Thursday.
In the evening Sri Sita Lakshmana sameta Kodanda Rama Swamy were performed Asthanam in the temple.
Temple DyEO Smt Nagaratna, temple inspector Sri Suresh and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 2024 అక్టోబరు 17: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 9 నుండి 10.30 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.