PAVITHROTSAVAM BEGINS IN SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirupati, 16 Jul. 20: The holy ritual of Pavitrotsavam, aimed at warding of bad impact of lapses in festivals etc. in TTD local temple of Sri Kodandarama Swamy temple commenced on Thursday.

Promoted by TTD with the objective to protect the divine charm of the temple the first day programs included Sahasra namarchana, snapana thirumanjanam for utsava idols at yagashala followed by Sattumora and Asthanam.

  Spl Gr DyEO Smt Parvathi, AEO Sri Durga Raju, Chief Priest Sri Ananda Kumar Deekshitulu, Superintendent Sri Ramesh, Temple inspector Sri Ramesh and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
 
తిరుప‌తి, 16 జూలై 2020: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలను ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.
 
మొదటిరోజు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు. 
 
సాయంత్రం ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం తదితర కార్యక్రమాలు చేపడతారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఆనంద‌కుమారాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ర‌మేష్ పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.