PAVITROTSAVAMS CONCLUDES IN KRT _ శ్రీ కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

TIRUPATI, 06 AUGUST 2021: The annual Pavitrotsavams concluded in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Friday evening.

Due to covid restrictions, this festival was observed in Ekantam.

On the last day, the three day festival came to an end with Maha Purnahuti.

Special Grade DyEO Smt Parvathi and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2021 ఆగ‌స్టు 06: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్ర‌వారం పూర్ణాహుతితో ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు.

రాత్రి యాగశాలలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, ఆగ‌మస‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ జ‌య‌కుమార్‌, శ్రీ మునిర‌త్నం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.