HANUMAN JAYANTI OBSERVED IN EKANTAM _ శ్రీ కోదండరామాలయంలో ఏకాంతంగా హనుమజ్జయంతి
Tirupati, 4 Jun. 21: Hanuman Jayanti was observed in Ekantam in Sri Kodanda Rama Swamy temple at Tirupati on Friday in view of Covid pandemic.
Special Pujas performed to the presiding deity of Sri Anjaneya Swamy located in front of the temple. Abhishekam was performed to this Anjaneya.
TTD cancelled Hanumantha Vahana Seva in the evening in view of Covid guidelines.
Special Grade Deputy EO Smt Parvati, AEO Sri Durgaraju and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో ఏకాంతంగా హనుమజ్జయంతి
తిరుపతి, 2021 జూన్ 04: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం హనుమజ్జయంతి ఏకాంతంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో సాయంత్రం జరగాల్సిన హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.
శరణాగత భక్తికి ఆదర్శంగా నిల్చిన ఆంజనేయస్వామివారి జయంతిని టిటిడి ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటలకు స్వామివారి మూలవర్లకు అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ శ్రీమతి పార్వతి, ఏఈఓ శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.