ANKURARPANAM PERFORMED _ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, 1 Mar. 21: The Ankurarpanam ritual for the annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram was performed on Monday.

The rituals of Punyahavachanam, Mrutsangrahanam, and Senadhipati utsava were performed in the evening of Monday as part of Ankurarpanam.

In view of the Covid guidelines all Vahana sevas are held in Ekantam.

JEO Smt Sada Bhargavi, Temple DyEO Smt Shanthi, VGO Sri Manohar, AEO Sri Dhanajeyudu, Temple Suptd Sri Chengalrayulu, Sri Ramaiah and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2021 మార్చి 01: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు సోమ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా సోమ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, విజిఓ శ్రీ మనోహర్, ఎఇఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మార్చి 2న ధ్వ‌జారోహ‌ణం

మార్చి 2న మంగ‌ళ‌వారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జర‌గనుంది. ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జర‌గ‌నుంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్లకు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

02-03-2021(మంగ‌ళ‌వారం) ధ్వజారోహణం(మీన‌లగ్నం) పెద్దశేష వాహనం

03-03-2021(బుధ‌వారం) చిన్నశేష వాహనం హంస వాహనం

04-03-2021(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

05-03-2021(శుక్ర‌వారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

06-03-2021(శ‌ని‌వారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

07-03-2021(ఆదివారం) హనుమంత వాహనం తిరుచ్చి, గజ వాహనం

08-03-2021(సోమ‌వారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

09-03-2021(మంగ‌ళ‌వారం) సర్వభూపాల వాహనం అశ్వవాహనం

10-03-2021(బుధ‌‌వారం) చక్రస్నానం ధ్వజావరోహణం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది