ALL SET FOR VAIKUNTA EKADASI AT SKVST- JEO _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు – టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
Tirupati, 21 Dec. 21: TTD JEO Sri Veerabrahmam directed officials to make extensive arrangements at the Sri Kalyan Venkateshwara Swamy Temple, Srinivasa Mangapuram for comfortable Vaikunta Ekadasi and Dwadasi Darshan on January 13-14 for all devotees.
Addressing a review meeting at the TTD administrative building on Tuesday the JEO instructed engineering officials to make arrangements for separate queues, shamiana, rangoli, flower and electrical decorations, drinking water, Anna Prasadam, parking and ensure hassle-free Darshan to all devotees.
Temple DyEO Smt Shanti, Temple Special Officer Dr T Ravi, AEO Sri Dhananjaylu, Superintendent Sri Chengalrayulu, Temple Archakas and staff were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు – టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2021 డిసెంబరు 21: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న ద్వాదశి సందర్బంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతి టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం జెఈవో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం కలిగేలా, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆలయ ప్రత్యేకాధికారి డా.రవి, ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.