BHOGI TERU HELD IN EKANTAM _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా భోగితేరు

Tirupati, 14 Jan. 22: On the auspicious occasion of the Bhogi festival, Bhogi Teru was observed in Ekantam in Sri Govinda Raja Swamy temple in Tirupati on Friday.

 

Special Grade DyEO Sri Rajendrudu and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా భోగితేరు

 తిరుప‌తి, 2022 జనవరి 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం భోగి పండుగ ఏకాంతంగా జ‌రిగింది. ఇందులోభాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా చేప‌ట్టారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్లు శ్రీ వెంకటాద్రి, శ్రీ నారాయ‌ణ‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ ధనుంజయ్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.