KAT AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 31 March 2022: TTD organised Koil Alwar Thirumanjanam fete at Sri Govindaraja Swamy temple on Thursday ahead of the Ugadi festival on April 2.

 As part of traditional practice after morning Nitya kainkaryas, the cleansing ritual in the temple was performed and devotees allowed for darshan at 9.30 am onwards. 

AEO Sri Ravi Kumar Reddy, Superintendent Sri Narayana, Temple Chief Archana Sri Srinivasa Dikshitulu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుప‌తి, 2022 మార్చి 31: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 2వ‌ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ నారాయ‌ణ‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ శ్రీ‌నివాస దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కామ‌రాజు, ఆర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.