KAVACHA PRATISTA HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ట‌

TIRUPATI, 01 JULY 2023: The annual Jyestabhishekam at Sri Govindaraja Swamy temple on Saturday witnessed Kavacha Pratista.

 

On the Second day of the ongoing annual Jyestabhishekam, Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi took a celestial ride all along the four mada streets in the pearl armour to the fascinating of devotees.

 

Both the seers of Tirumala, DyEO Smt Shanti and others were also present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ట‌

తిరుపతి, 2023, జూలై 01: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు శ‌నివారం కవచప్రతిష్ట‌ వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఆలయంలో ఉద‌యం శ‌త‌క‌ల‌శ‌స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. అనంతరం ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ట‌ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.