TULASI UTSAVAM AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా తులసి మహత్యం ఉత్సవం
Tirupati,16 August 2024: TTD organised the Tulasi mahatyam utsavam at Sri Govindaraja Swami temple on Friday.
As part of the festivities, the Swamy has taken a pride ride on Garuda Vahanam along the Mada streets in the morning after daily Kainkaryas and Vishwarupa Darshanam.
This was followed by Swamivari Asthanam where archakas chanted Tulasi Mahatya Purananam.
Temple Superintendent Sri Mohan Rao, temple inspector Sri Dhananjay and archakas participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా తులసి మహత్యం ఉత్సవం
తిరుపతి, 2024 ఆగస్టు 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, విశ్వరూప దర్శనం కల్పించారు. ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
అనంతరం శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు బంగారు వాకిలి చెంత సింహాసనంపై వేంచేపు చేశారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.