శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రావణ ఉపకర్మ
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రావణ ఉపకర్మ
తిరుపతి, 2024 ఆగస్టు 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.