SRI MADHURAKAVI ALWAR, SRI ANANTHALWAR AVATARA UTSAVAMS BEGINS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ మ‌ధుర‌క‌వి ఆళ్వార్‌, శ్రీ అనంతాళ్వాన్ అవ‌తార ఉత్స‌వాలు ప్రారంభం

TIRUPATI, 01 MAY 2025: The renowned poetic saints, Sri Madhurakavi Alwar and Sri Ananthalwar Avatara Utsavams began on Thursday at the Sri Govindaraja Swamy Temple in Tirupati. 

The festival will continue till May 10. Special programs will be organized in the temple on this occasion.

On May 10, Sri Govindaraja Swamy along with Sri Devi Bhudevi will visit Madhurakavi Alwar and Sri Ananthalwar and bless the devotees.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ మ‌ధుర‌క‌వి ఆళ్వార్‌, శ్రీ అనంతాళ్వాన్ అవ‌తార ఉత్స‌వాలు ప్రారంభం

తిరుపతి, 2025 మే 01: తిరుప‌తి శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ మ‌ధుర‌క‌వి ఆళ్వార్‌, శ్రీ అనంతాళ్వార్ అవ‌తార ఉత్స‌వాలు గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మయ్యాయి. ఈ ఉత్సవాలను మే 10వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మే 10వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాళ్వార్ వారి సన్నిధికి వేంచేసి భక్తులను అనుగ్రహించనున్నారు.

శ్రీ మధురకవి ఆళ్వార్

దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వార్ల‌లో శ్రీ మధురకవి ఆళ్వార్ ఒకరు. ఈయన నమ్మాళ్వార్ శిష్యుడు, పన్నెండు మంది ఆళ్వార్లలో గొప్పవాడిగా పరిగణించబడ్డారు.

శ్రీ అనంతాళ్వార్

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆచార్య పురుషులలో శ్రీ అనంతాళ్వార్ ఒకరు. భగవత్ రామానుజాచార్యుల ఆదేశానుసారం తిరుమలకు వచ్చి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో ఆయ‌న‌ తోటను ఏర్పరచారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.