BHASYAKARLA SATTUMORA HELD IN SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
Tirupati, 02 May 2025: The 10-day Bhasyakarla festival at Sri Govindaraja Swamy Temple in Tirupati concluded with Sattumora on Friday.
As part of this, Tirumanjanam, Asthanam and Sattumora were performed.
Bhagavad Ramanuja commented on the Mimamsa Grantha under the name “Sri Bhashyam” based on the unique non-dvaita theory. That is why he became famous as a Bhasyakarulavaru.
Bhagavad Ramanuja traveled all over the country and propagated Sri Vaishnavism. Along with the renovation and development of many Sri Vaishnava sites in the country, strict arrangements were made to ensure that temple worship and related programs be conducted properly.
The rituals introduced by Sri Ramanujacharya according to the Vaikhanasa Agama in the Srivari Temple are still continuing. Along with the establishment of the Jeeyar Math, Sri Ramanujacharya undertook the construction of sub-temples in the Srivari Temple, the installation of idols, various offerings, the recitation of Alwar Divya Prabandha Pasuras, the establishment of four Mada Vidhi, Poornakumbha Swagatam and the appointment of Acharya Purushas.
The Deputy EO of the temple, Smt. Shanti, other officials, temple priests and a large number of devotees participated in this program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
తిరుపతి, 2025 మే 02: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు జరిగిన భాష్యకార్ల ఉత్సవాలు శుక్రవారం సాత్తుమొరతో ముగిశాయి.
ఇందులో భాగంగా ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం స్వామివారికి తిరుమంజనం, ఆస్థానం, సాత్తుమొర నిర్వహించారు.
భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధిచెందారు.
భగవద్ రామానుజులు దేశమంతటా సంచరించి శ్రీవైష్ణవతత్వాన్ని పరిపుష్టం చేస్తూ ప్రచారం చేశారు. దేశంలోని అనేక శ్రీవైష్ణవక్షేత్రాల జీర్ణోద్ధరణ, అభివృద్ధి చేయడంతోపాటు ఆలయ పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీయర్ మఠం ఏర్పాటుతో పాటు శ్రీవారి ఆలయంలో ఉప ఆలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ, పలు నైవేద్యాల సమర్పణ, ఆళ్వార్ దివ్యప్రబంధ పాశురాల పారాయణం, నాలుగు మాడ వీధుల ఏర్పాటు, పూర్ణకుంభ స్వాగతం, ఆచార్య పురుషుల నియామకం వంటి వాటిని శ్రీ రామానుజాచార్యులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.