CULTURAL SPLENDOR AT SRI GT BRAHMOTSAVAMS _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకుంటున్న సాంస్కృతికశోభ

Tirupati, 04 June 2025: The religious, musical and cultural programs organized on the occasion of the annual Brahmotsavams of Sri Govindaraja Swamy temple in Tirupati on Wednesday entertained the devotees.

Mangaladhvani was organized by the SV College of Music and Dance from 5.30 am to 6.30 am at the Sri Govindaraja Swamy temple. 

The peacock dance, Kuchipudi, Bharatanatyam, Kolatam,  Chakkabhajana stood as a special attraction during Vahana Sevas.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకుంటున్న సాంస్కృతికశోభ

తిరుపతి, 2025, జూన్ 04: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్.వి సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి డి.శ్రీవాణి చంద్ర బృందం చేపట్టిన నెమలి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన రాధారమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో కూచిపూడి నృత్యం చేపట్టారు.

బాపట్లకు చెందిన పత్తేపురం గ్రామానికి చెందిన అచ్యుత వాణి అండ్ టీం, ఏలూరుకు చెందిన పార్వతీ రామచంద్రన్ కల్చరల్ టీం, రామచంద్రాపురం మండలానికి చెందిన సీతారామాంజనేయ టీం, తిరుపతికి చెందిన గౌరీశంకర్ టీం, రాజమండ్రికి చెందిన హేమలత టీం, పీటీఎం మండలానికి చెందిన పట్టాభి రామ కోలాట బృందం ఆకట్టుకునేలా లయబద్ధంగా కోలాటం నృత్యం ప్రదర్శించారు.

బెంగళూరుకు చెందిన సుప్రేంద్ర బాబు అండ్ టీం, తిరుచానూరుకు చెందిన శ్రీదేవి భూదేవి బృందం, తిరుపతికి చెందిన రిషాణ్వి డ్యాన్స్ అకాడమీ భరత నాట్యం ప్రదర్శించారు.

రామచంద్రాపురం మండలానికి చెందిన చంద్రశేఖర్ బృందం చక్కభజన చేపట్టారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.