JYESTABHISHEKAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE FROM 06 TO 08 _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 06 నుండి 08 వరకు జ్యేష్ఠాభిషేకం
Tirupati, 04 July 2025: The annual Jyestabhishekam at Sri Govindaraja Swamy Temple, Tirupati, will be held from July 06 to 08.
On July 06, rituals include Sata Kalasha Snapanam, Maha Shanti Homam, and Snapana Tirumanjanam to the deities.
On July 07, Sattumurai, Asthanam, and an evening procession with Ubhaya Nachiyars will be conducted.
On July 08, Tirumanjanam, Kavacha Pratishtha, and Kavacha Samarpana will be performed, followed by a procession from 5.30 PM to 6.30 PM.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 06 నుండి 08 వరకు జ్యేష్ఠాభిషేకం
తిరుపతి, 2025, జూలై 04: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 06 నుండి 08వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు జూలై 06న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపడుతారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, బ్రహ్మఘోష తదితర కార్యక్రమాలు వేడుకగా జరుగనున్నాయి.
జూలై 07వ తేదీ రెండో రోజున ఉదయం సాంప్రదాయబద్ధంగా కైంకర్యాలు జరిగాక శాత్తుమొరాయి, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం ఉభయ నాంచారులతో స్వామివారు నాలుగు మాడా వీధులలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూలై 08వ తేదీ మూడో రోజున తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట తదితర కార్యక్రమాల అనంతరం సాయంత్రం కవచ సమర్పణ చేపడుతారు. సాయంత్రం 5.30 – 6.30 గం.ల వరకు ఉభయ నాంచారులతో శ్రీవారు నాలుగు మాడ వీధులలో విహరిస్తారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.