ADHYAYANOTSAVAMS CONCLUDES IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
Tirupati, 17 Feb. 20: The unique Agama event of Adhyayanotsavams, which were underway at Sri Govindarajaswamy temple since January 25, concluded on Monday amidst special rituals.
The day began in the temple with the procession of all utsava idols up to Sri Kapilathirtha where Thirumanjanam and Asthanam were performed and later brought back to Sri Govindarajaswamy temple in a procession in the afternoon.
Sri Sri Sri Pedda Swamy and Chinna Jeeyarswami of Tirumala, Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Kumar, Superintendents Sri Rajkumar, Sri Sharma, Temple inspectors Sri Krishna Murthy, Sri Munindrababu and others participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
ఫిబ్రవరి 17, తిరుపతి, 2020: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 25న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ విష్వక్సేనులవారు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. తిరుపతి వీధుల గుండా కపిలతీర్థానికి చేరుకున్న అనంతరం అక్కడ తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. అక్కడినుంచి బయల్దేరి పిఆర్ గార్డెన్ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్‌కుమార్, శ్రీ శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.