SRAVANA UPAKARMA HELD IN GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రావణ ఉపకర్మ

TIRUPATI, 09 AUGUST 2025: Sravana Upakarma was observed with religious fervour in Sri Govindaraja Swamy temple on Saturday in connection with the auspicious occasion of Sravana Pournami.

Both the Utsava deities of Sri Govindaraja Swamy and Sri Krishna Swamy were taken to Alwarthirtham in Kapila Theertham temple and were offered Snapana Tirumanjanam followed by Homan and Asthanam.

Later the deities returned to the Sri Govindaraja Swamy temple.

Both the Pontiffs of Tirumala temple, Temple officials, priests and devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రావణ ఉపకర్మ

తిరుపతి, 2025, ఆగష్టు 09: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, హోమం, ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈఓ శ్రీ ఏవీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.