KOIL ALWAR TIRUMANJANAM HELD AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 25 December 2025: Koil Alwar Tirumanjanam was conducted in a grand and traditional manner at the Sri Govindaraja Swamy Temple, Tirupati, on Thursday morning.
As per tradition, this sacred ritual is performed in the temple ahead of the Vaikuntha Ekadasi festival, which will be observed on December 30.
After the completion of the ritual, devotees were allowed for Sarva Darshan.
Temple AEO Sri Bhaskara Narayana Choudary, Superintendent Sri Seshagiri, Temple Inspector Sri Dhananjayulu, along with the team of archakas, participated in the programme.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2025 డిసెంబరు 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ భాస్కర నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.




