శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 26: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా శనివారం ఉదయం 08.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని బంగారు తిరుచ్చి పై వేంచేపు చేసి ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం తిరుప్పావై సేవతో స్వామివారిని మేలుకొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించి 8.30 గంటలకు స్వామి అమ్మవార్లను బంగారు తిరుచ్చిపై వేంచేపు విశేషాలంకరణ గావించారు. అనంతరం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.