SRI ANDAL NEERATOTSAVAM CONCLUDES IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు

Tirupati, 12 Jan. 21: The seven day long Sri Godadevi (Andal Ammavaru) Neeratotsavam which commenced from January 6 onwards concluded at Sri Govindarajaswami Temple on Tuesday.

As part of the festivities, the utsava idol of Goddess Sri Andal Goda Devi was richly decorated with an upper face veil and paraded inside the Vimana Prakaram.

After asthanam at Kalyana Mandapam Tirumanjanam and Nivedana were performed.

The Neeratotsavam concluded with Procession on Bangaru Tiruchi inside temple premises.

Special Grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravikumar Reddy, Chief archaka Sri Srinivasa Deekshitulu, Superintendent Sri Raj Kumar, Temple Inspector Sri Krishnamurthy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 12: తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 6వ‌ తేదీ నుంచి ఏడు రోజుల పాటు జ‌రిగిన శ్రీ ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారి నీరాటోత్సవాలు మంగళవారం ముగిశాయి.

ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీఆండాళ్ అమ్మవారిని పల్లకీలో విశేషాలంకరణ చేసి మేలిముసుగు ధరింపజేసి విమాన ప్రకారం చుట్టూ ఉత్సవం నిర్వహించారు. ఆ త‌రువాత కళ్యాణ మండపంలో వేంచేపు చేసి ప్రత్యేక తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించి నివేదన, ఆస్థానం చేప‌ట్టారు. సాయంత్రం అమ్మవారిని బంగారు తిరుచ్చిపై విశేషంగా అలంకరించి విమాన ప్రాకారం చుట్టూ ఉత్సవంగా  ఆండాళ్ సన్నిధికి వేంచేపు చేశారు. దీంతో నీరాటోత్సవాలు ముగిశాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటి ఈఓ శ్రీ రాజేంద్రుడు, ఏఇఓ శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు , సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్సెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.