COOKING VESSELS DONATED TO SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలు విరాళం 

Tirupati, 21 January 2026: A Tirupati based devotee Sri Murali, donated cooking vessels worth ₹18 lakhs to the Sri Govindaraja Swamy Temple at Tirupati on Wednesday.

The cooking vessels, including Sola, Ara Sola, and other  Potu (kitchen)utensils will be used for preparing prasadam for devotees.

They were handed over  to TTD FA & CAO Sri  Balaji in the presence of

Temple Deputy EO Smt.  Shanti.

The AEO Sri Narayana Chowdary, Superintendent Smt. Padma Priya, temple archakas, and other staff were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలు విరాళం 

తిరుపతి, 2026, జనవరి 21: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తిరుపతికి చెందిన శ్రీ మురళీ అనే భక్తుడు రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలను విరాళంగా అందించారు. 

శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట పాత్రలైన సోలా, అర సోలా, పోటు వంట సామాన్లను బుధవారం ఉదయం టిటిడి ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీకి అందజేశారు. 

ఈ సందర్భంగా ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీ దాత శ్రీ మురళీని అభినందించారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ ఏ బీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీమతి పద్మ ప్రియ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.