‌SATTUMORA HELD _ శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

TIRUPATI, 07 AUGUST 2024: On the occasion of Tiruvadipuram festival, Sri Andal Sattumora was held with religious pomp in Sri Govindaraja Swamy temple in Tirupati on Wednesday.

Both the seers of Tirumala, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

తిరుపతి, 2024 ఆగస్టు 07: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సంద‌ర్భంగా బుధవారం ఘ‌నంగా శాత్తుమొర జ‌రిగింది.

ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహించారు. అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకోనున్నది.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణా రెడ్డి, సూప‌రింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.