PAVITROTSVAMS COMMENCES IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

Tirupati, September 03, 2025: The annual Pavitrotsavams commenced in Sri Govindaraja Swamy temple in Tirupati on Wednesday.

Pavita Pratista was performed after performing Snapanam to deities.

This religious event was graced by Sri Sri Pedda Jeeyar, Sri Sri Chinna Jeeyar, TTD Deputy EO Smt. V.R. Shanthi, AEO Sri A.B. Narayana Choudhary, Superintendents, Temple Inspectors, Archakas, and a large number of devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

తిరుపతి,2025సెప్టెంబర్ 03: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారుఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తంపంచగవ్య ప్రాసన చేపట్టారుఅనంతరం కల్యాణ మండపం నందు స్నపన తిరుమంజనంశాత్తుమొరఆస్థానం చేపట్టారు.

సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం  చేపట్టారురాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

గురువారం మూలవర్లకుఉత్సవర్లకు ఉప సన్నిధిలో పవిత్ర సమర్పణ చేపడుతారుఅనంతరం విమాన ప్రాకరంధ్వజస్తంభంమాడవీధులలోని శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు.

 కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జీయర్శ్రీ శ్రీ చిన్న జీయర్లుటిటిడి డిప్యూడీ ఈవో శ్రీ వి.ఆర్శాంతిఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరిసూపరింటెండెంట్ లుఆలయ ఇస్పెక్టర్లు , అర్చకులభక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.