OCTOPUS MOCK DRILL AT SRI GT _ శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్
Tirupati, 01 December 2023: The Octopus Team has organized a mock drill at Sri Govindarajaswami temple in Tirupati on Friday with the task of rescuing the devotees from terrorist attacks.
The mock drill is a part of the annual exercise by the Octopus force at several temples and government buildings across the country led by its DSP Sri Krishna and the supervision of Octopus SP Sri B Ravichandran.
The temple staff, archakas, civil police, medics and reserve police were explained about the steps to be followed during terrorist attacks.
AEO Sri Mumikrishna Reddy, AVSO Sri Narayana, VI Sri Venkataramana Reddy, Superintendents Sri Nagaraju, Sri Mohan, AE Sri Murali Mohan octopus inspectors Sri Rambabu, KVS Ramakrishna, MRavi babu, Shiva Reddy, fire services staff were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్
తిరుపతి, 2023 డిసెంబరు 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.
ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ శ్రీ బి.రవిచంద్రన్ పర్యవేక్షణలో డి.ఎస్.పి శ్రీ బి.కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై ఆలయ సిబ్బందికి, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.
ఈ ఆపరేషన్ లో ఆలయం ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, ఎవిఎస్వో శ్రీ నారాయణ, వీఐ శ్రీ వెంకటరమణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నాగరాజు, శ్రీ మోహన్, ఏఈ శ్రీ మురళీమోహన్, ఆక్టోపస్ ఇన్స్పెక్టర్లు శ్రీ రాంబాబు, కేవీఎస్ రామకృష్ణ, ఎం.రవిబాబు, శివారెడ్డి, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.