FESTIVALS IN GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి నెల‌లో విశేష ఉత్స‌వాలు

Tirupati, 3 Jan. 21: The following are the festivals scheduled to be observed at Sri Govindaraja Swamy temple during January held in Ekantham as per COVID-19 guidelines. 

January 13: Procession of Sri Krishna Swamy and Sri Andal Ammavaru on Bhogi Ratham within temple prakaram as part of Bhogi festivities.

January 14:  Special activities in Sri Govindaraja Swamy temple as part of Makara Sankranthi 

·      Sankranthi Tirumanjanam at 6.30am

·      Chakrasnanam of Sri chakrathalwar at Kalyana Mandapam between 9.30am and 11am

·      Asthanam and procession of utsava idols of Sri Govindaraja Swamy and consorts Sridevi and Sri Bhudevi between 4pm and 5pm inside the temple.

·      Sri Goda Parinayotsavam on January 15: As part of Sri Goda Parinayotsavam procession of Melchat vastrams and garlands from Sri Pundarikavalli Ammavari temple and presentation at Sri Andal Ammavari temple.

·      Sri Goda Parinayotsavam festivities at Sri Pundarikavalli Ammavari temple between 4pm and 6pm

·      Parveta utsavam on January 16: As part of Parveta Utsavam, a procession of Utsava idols of Sri Govindaraja Swamy and His consorts up to Kalyana Mandapam for Asthanam at Sri Andal Ammavari temple and return

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి నెల‌లో విశేష ఉత్స‌వాలు   

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 03: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు  జ‌రుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాలన్నీ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

జనవరి 13న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భోగి తేరు

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 13వ తేదీ భోగి పండుగను  నిర్వహించనున్నారు. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగి తేరుపై కొలువు దీర్చి ఆలయంలోని విమాన ప్రాకా‌రంలో ఊరేగింపు నిర్వహిస్తారు.

జనవరి 14న మకర సంక్రాంతి

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటలకు సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 9.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలోనికి తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి ఆస్థానం చేపడతారు.

జనవరి 15న గోదా ప‌రిణ‌యోత్స‌వం

        శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీ గోదా పరిణయోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 5.30 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు.  సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం గోదా ప‌రిణ‌యోత్స‌వం నిర్వ‌హిస్తారు.

జనవరి 16న పార్వేట ఉత్సవం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 16న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హిస్తారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.