శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

తిరుపతి, 2021 ఆగ‌స్టు 11: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సంద‌ర్భంగా బుధ‌వారం శాత్తుమొర జ‌రిగింది.

ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి నిర్వ‌హించే ఊరేగింపును కోవిడ్‌-19 కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా సాయంత్రం ఆల‌యంలోనే విమాన‌ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించారు. అనంత‌రం శాత్తుమొర‌, ఉభ‌య‌దారులు ఉభ‌యం స‌మ‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూప‌రింటెండెంట్లు శ్రీ కుమార్‌, శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.